H-1B వీసా ఫీజును ట్రంప్ సర్కార్ లక్ష డాలర్లకు పెంచడంతో వాల్మార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. H-1B వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేయనున్నట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందిస్తూ అభ్యర్థుల నియామకాల విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు ప్రతిభావంతులను నియమించనున్నట్లు తెలిపింది.