KMM: DCCBలో ఖాళీగా ఉన్న 99 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ సహకార బ్యాంక్ (TGCAB) చర్యలు చేపట్టింది. IBPS ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీరత సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించగా, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 6లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై డిసెంబర్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.