కోనసీమ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జాతీయ కోఆర్డినేటర్గా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జంగా గౌతమ్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన పార్టీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని బుధవారం ఉదయం ఆయన తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఆయనకు పలువురు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.