HYD: హైదరాబాద్లో టపాసుల పొగతో గాలి విషపూరితంగా మారిందని సెంట్రల్ AQI లైవ్ రిపోర్ట్ తెలిపింది. AQI ప్రస్తుతం 353గా నమోదయింది. ఈ గాలి పీల్చితే వాంతులు, విరోచనాలు, కళ్లు తిరిగి కింద పడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా డాక్టర్ రవి తెలిపారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు.