AP: ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏపీలో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకరించాలని మార్టిన్ జైటర్ను లోకేష్ కోరారు. పారమట్టాలో స్థానిక వ్యాపారాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని ఆయన ప్రశంసించారు.