AP: తిరుమలలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. అలాగే, నెల్లూరులో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి శివారు కాలనీల్లో వర్షపు నీరు ప్రవాహిస్తోంది. గాంధీబొమ్మ సెంటర్, పొగతోట భగత్ సింగ్ కాలనీలో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.