నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక సంతపేట మార్కెట్‌ను మంగళవారం పరిశీలించారు. ఇటీవల మార్కెట్లో అగ్నిప్రమాద సంభవించిన దుకాణాలలో నూతనంగా చేపడుతున్న ఎలక్ట్రికల్ వైరింగ్, పెయింటింగ్ ఇతర పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.