TG: మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అన్న హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చించలేదని అన్నారు. హరీశ్ రావు చేసిన ఆరోపణలపై ఆయన మొక్కే కొనాయపల్లి వెంకటేశ్వర గుడికి శనివారం తడిబట్టలతో వస్తానన్నారు. అక్కడికి హరీశ్ రావు కూడా వచ్చి ఆయన చేసిన ఆరోపణలు నిజమే అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.