AP: గూగుల్ డేటా AI హబ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం శుభపరిణామం. విశాఖ గ్లోబల్ క్యాపిటల్‌గా మారబోతోంది. యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి. విశాఖలో నూతన శకం ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సవాళ్లు అధిగమిస్తూ లక్ష్యాన్ని పూర్తి చేద్దాం’ అని చెప్పారు.