ADB: ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం నుంచి పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రేపు జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వాటర్స్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఉంటుందని నార్నూర్ ఎస్సై అఖిల్ మంగళవారం ప్రకటించారు. దీంతో యువత, ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు.