కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలోకి వెళ్ళేందుకు గతంలో ప్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. అప్పటి నుండి ఇటు సామర్లకోట రాజమండ్రి బస్సులు వంతెన నుండి పీహెచ్సీ సెంటర్కు వచ్చి తిరిగి వెళుతున్నాయి. కాగా ఇటీవల RTCలో అద్దెకు తిప్పుతున్న బస్సులు లోనికి రావడం లేదని గ్రామస్తులు మంగళవారం బ్రిడ్జిపై RTC బస్సులను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.