ASR: గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, సాంప్రదాయ పంటలు పండించి ఆర్ధికాభివృద్ది సాధించాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు సూచించారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. మంగళవారం కప్పగొంది గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.