ప్రకాశం: నాగులుప్పలపాడు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లను మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, గదులను, మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు, సిడి ఫైల్స్‌ను తనిఖీ చేశారు. లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.