ATP: గుంతకల్లు పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 7 రోజులుగా సీపీఐ ఆధ్వర్యంలో చేస్తున్న సామూహిక రిలే దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరాయి. సీపీఐ రూరల్ కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. వారం రోజులుగా సామూహిక రిలే దీక్షలు చేస్తున్న అధికారులలో ఎలాంటి చలనం లేదని వారు మండిపడ్డారు. అధికారులు స్పందించి పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలన్నారు.