W.G: భీమవరం మార్కెట్ యాడ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. పోలీసులు తమ విధి నిర్వహణలో రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం కృషి చేస్తారన్నారు. వారి సేవలు అభినందనీయమన్నారు. వారి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని మంత్రి అన్నారు.