AP: శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి వచ్చే నెల 21 వరకు కార్తీక మాసోత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో ఆలయ EO శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. భక్తుల దర్శనం, పుణ్యస్నానాలు, ట్రాఫిక్, పార్కింగ్, వైద్యం, పారిశుద్ధ్యం తదిరల అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.