PAKతో రెండో టెస్టులో 7 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 22 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ చేశాడు. పాక్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన(102/7) చేసిన SA ప్లేయర్గా పాల్ ఆడమ్స్(128/7) 2003)ని అధిగమించాడు. అలాగే అత్యధిక 5 వికెట్ హాల్స్ సాధించిన రెండో SA ప్లేయర్గా వెర్నాన్ ఫిలాండర్(13) తర్వాతి స్థానంలో కేశవ్(12) నిలిచాడు.