AP: పోలీస్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్న శుభవార్త చెప్పారు. మంగళవారం పోలీస్ ఆమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 6100 కానిస్టేబుల్స్ నియామకం చేపట్టిందని.. త్వరలో పోస్టింగులు ఇస్తామని తెలిపారు. పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే గత YCP పాలనలో నియామకాలు జరగలేదని విమర్శించారు.