WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలో మంగళవారం AO విజయ్ మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.13.80 లక్షల వ్యయంతో 6 రకాల యంత్రాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ, ఇతరులకు 40% సబ్సిడీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.