AKP: కశింకోట ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి ప్రభుత్వం ఎట్టకేలకు బకాయి వేతనాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించింది. జీతాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ విజయ్ కృష్ణ ఆదేశాల మేరకు 8 నెలల బకాయిలు చెల్లించడంతో మంగళవారం అధ్యాపకులు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.