ATP: తాడిపత్రిలో కార్తీక మాస ఉత్సవాలు మొదలయ్యాయి. తొలిరోజు సందర్భంగా బుధవారం బుగ్గ రామలింగేశ్వర స్వామికి అర్చకులు పూజలు నిర్వహించారు. ఉదయం వివిధ అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. కార్తీక మాసం తొలిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.