NLG: నల్లగొండ పట్టణంలో తొలిసారిగా ఎలక్షిక్ ఆటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛమైన గాలి, శబ్ద రహిత ప్రయాణం లక్ష్యంగా ఈ ఆటోలు నల్లగొండ పట్టణంలో తిరుగుతున్నాయి. ఇవి ఇంధనం తగ్గించడంతోపాటు హరిత భవిష్యత్తుకు తొలి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా యువకులు ఈ మార్పును పూర్తిగా స్వాగతిస్తున్నారు.