KKD: తునిలో విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై హోం మంత్రి వనిత తీవ్రంగా స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు బుధవారం రాత్రి ఆమె తెలిపారు. పోలీసులు నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు పంపారని ఆమె వెల్లడించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.