SKLM: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు బుధవారం శాసనసభ ప్రాంగణంలో తనకు కేటాయించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించి, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు. కొద్దికాలం క్రితం కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని కల్పించిన విషయం తెలిసిందే.