గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం రాత్రి పట్టాభిపురం, బ్రాడీపేట, బస్టాండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి ట్రాఫిక్ తీరును పర్యవేక్షించారు. ట్రాఫిక్ సిబ్బంది తప్పనిసరిగా పాయింట్లలో ఉండాలని, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను సూచించారు.