ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి రైతులు హడలెత్తిపోతున్నారు. మండలంలోని ఉమ్మనపల్లి పంచాయతీలో పంటలు నీట మునగడంతో బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగు చేస్తున్న అలసంద, పొగాకు నీట మునగగా, కోతకు వచ్చిన మొక్కజొన్న దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.