ADB: బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయుడు గౌర్కర్ అతుల్ రూ.10 వేల విలువ గల గ్రీన్ మ్యాట్‌ను బుధవారం అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని HM ఏలియా అన్నారు.