HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి అమలు పరుస్తున్నారు.