E.G: ఏలూరులో జరిగిన ఏపీ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో కొంతమూరుకు చెందిన ఎం. సతీశ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఫ్రీ స్టైల్ 50 మీటర్లను 46 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్‌ను, బ్రెస్ట్ స్ట్రోక్‌లో బ్రాంజ్ మెడల్‌ను సాధించాడు. ఈ విజయంతో నవంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు సతీశ్ ఎంపికయ్యాడు.