KRNL: రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.