అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్పై ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించిన ఘటన వెలుగుచూసింది. ‘తన మిత్రుడికి గృహోపకరణాల దుకాణం ఉందని, సహాయం చేయాలంటూ’ కలెక్టర్ పేరుతో సందేశాలు పంపినట్టు పోలీసులు గుర్తించారు. కలెక్టర్ కార్యాలయం అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.