NZM: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమోద్ సేవలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.