MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామ శివారులలో బుధవారం సాయంత్రం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కురుమూర్తి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను చూసి హఠాత్తుగా కారును ఆపారు. ఎలా చదువుకుంటున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు.