KMR: జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం బుధవారం (నిన్న) వరకు 1,449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. నేటికి చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.