ప్రకాశం: జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.