W.G: తణుకు (M) తేతలిలో ఐదేళ్ల బాలిక అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ మంగళవారం కేసు నమోదు చేశారు. పెరవలి మండలం ఖండవల్లికి చెందిన ధనకొండ దుర్గమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి గంగిరెద్దుతో ఊరూరా తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కుమార్తె వీరమ్మను తేతలిలో తాత్కాలిక మకాం వద్ద ఉంచి వెళ్లి తిరిగి రాగా కనిపించడం లేదన్నారు.