AKP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఎలమంచిలిలో ఎమ్మెల్యే జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.