SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలానికి చెందిన పలువురు స్వామి మాల ధారణ చేసిన భక్తులు విజయనగరం పార్లమెంట్ మెంబర్ కలిశెట్టి అప్పలనాయుడును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమలకు వెళ్లేందుకు అనువుగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. రైల్వే శాఖతో చర్చించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భక్తులకు సహకరించాలని కోరారు.