SKLM: పాతపట్నం మండలం తామర గ్రామంలో కోదండ రామాలయంలో అఖండ నామ సంకీర్తన భజన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని , కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే భక్తి భావం సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.