TG: రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సెన్సేషనల్ ఆరోపణలు నమోదయ్యాయి. మాగంటి గోపీనాథ్ ఆయన మొదటి భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని ఆమె కొడుకు తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ తన అమ్మ మాగంటి గోపినాథ్ భార్యనేనని పేర్కొన్నారు. అలాంటప్పుడు సునీత భార్య ఎలా అవుతుందని ప్రశ్నించారు.