HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు భారీగా వచ్చాయి. అర్థరాత్రి వరకూ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 321 సెట్లు దాఖలవగా, 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్న ఒక్కరోజే 117 మంది నుంచి 194 సెట్లు సమర్పించబడ్డాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది. భారీగా నామినేషన్లు రావడంతో ఉప ఎన్నికపై ఆసక్తి పెరుగుతోంది.