PDPL: రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్ షిప్లో ప్లాంట్ నుంచి గౌతమీ నగర్ వస్తుండగా ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. టౌన్ షిప్లో టర్నింగ్ పాయింట్ వద్ద స్పీడ్‌గా వెళ్లిన కారు డివైడర్‌ను ఢీకొని పైకెక్కింది. కారులో ఉన్నవారు సురక్షితంగా బయట పడగా.. కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.