HNK: భీమదేవరపల్లి మండల కేంద్రంలో బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని వైద్య సేవలను సద్వినియోగ చేసుకున్నారు.