VSP: విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న వారుష్ ఐటీ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను మోసం చేసింది. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టి, ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాధితులు మంగళవారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాల పేరుతో లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు.