JGL: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్య మంత్రిని కోరారు. CM రేవంత్ రెడ్డి ఈ వినతిపై సానుకూలంగా స్పందించారన్నారు.