బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,81,900 వద్ద కొనసాగుతోంది.