KMR: జుక్కల్ నియోజకవర్గంలో దీపావళి వేడుకల్లో భాగంగా భాహుబీజ్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు హారతి ఇచ్చి తీపి పదార్ధాలు తినిపించి ఆశీర్వదిస్తారు. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి సంప్రదాయం ప్రకారం ఈ పండగ జరుపుకుంటారు. కార్తీకమాసం రెండో రోజు ఈ పండుగ చేస్తారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా పండుగ చేపడతారు.