KMR: ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన యోధుడు కొమరం భీమ్ అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు అన్నారు. బుధవారం జిల్లా పార్టీ ఆఫీసులో ఆయన జయంతిని సందర్భంగా నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ (నీరు, అడవి, భూమి) అనే నినాదంతో పోరాడి నేటి పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వీరుడని కొనియాడారు.