AP: భారీ వర్షాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దక్షిణా కోస్తాలో అతిభారీ వర్షాల దృష్ట్యా రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే, మస్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. వాగుల ఉధృతి ఉన్నచోట ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.