GNTR: కార్తీక మాసం సందర్భంగా తెనాలి నుంచి పంచరామాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం క్షేత్రాలకు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. అలాగే, శ్రీశైల దర్శిని పేరిట ప్రత్యేక సర్వీసు నడుపుతున్నామని పేర్కొన్నారు.